మెదక్ : సీఎం రేవంత్ రెడ్డికి ఆడపడుచులు తగిన బుద్ధి చెప్తారని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో పోస్ట్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు కల్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. పేద ప్రజలకు కల్యాణ లక్ష్మి రాకుండా కోర్టులోకి కేసు వేసి కాంగ్రెస్ పార్టీ రద్దు చేసే ప్రయత్నం చేసిందన్నారు.
హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని కళ్యాణ లక్ష్మి పథకాన్ని పూర్తిగా నిలిపివేసే కుట్ర చేసిందన్నారు. మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే కాలం వస్తుందన్నారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన హామీలు అమలు చేసే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు.