మెదక్ మున్సిపాలిటీ, జూన్ 2: ఎందరో త్యాగాల ఫలమే స్వరాష్ట్రమని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి తదితర బీఆర్ఎస్ నేతలతో కలిసి జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటలు చేసి అమరులయ్యారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు ఎన్నో ఉద్యమాలు చేసి శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆంజనేయులు, కృష్ణాగౌడ్, లింగారెడ్డి, బాలగౌడ్, విష్టువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అంజగౌడ్, కిష్టయ్య, జుబేర్ అహ్మద్, నగేశ్, రాధ మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, మల్లేశం, రబ్బీ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో వెంకటస్వామి, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ రవీంద్రకుమార్ జాతీయజెండాలను ఎగురవేశారు.