ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలి
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్సీలు ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డితో కలసి ఆమె హాజరయ్యారు.
- ‘సర్’ ప్రక్రియలో పాల్గొని ఓటరు ఫారాలు పూర్తిచేసి ఇవ్వాలి
- ఓటర్లకు అవగాహన కలిపించాలి
- బీఆర్ఎస్ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి
- బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపు
మెదక్ అర్బన్, జూన్ 26 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్పై అవగాహన కలిగి ఉండాలని, బూత్ స్థాయిలో ఓట్లు తొలిగించకుండా జాగ్రత్త పడలని మాజీ డిప్యూటీ స్పీకర్,బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్సీలు ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డితో కలసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఓట రు జాబితాను పరిశీలించి, మున్సిపల్ పరిధిలో వార్డులు, గ్రామాల్లో ఒక ఓటు తొలిగించకుండా జాగ్రత్త పడాలన్నారు. సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లు తొలిగించే ప్రమాదం ఉందని,జాగ్రత్తగా ఉండి ఓటర్లకు సూచనలు చేయాలన్నారు.
మన అధినేత కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒకరూ తప్పుకుండా పాటించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు వచ్చి ఓటరు జాబితాకు సంబందించిన సమాచారం అడిగిన వెంటనే ఇచ్చి, ఓట్లు పోకు ండా చూడాలన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్క రూ పనిచేయాలని, ఇది ఎన్నికల కమిషన్ పని అని దూరం ఉండకూడదని సూచించా రు. ఓట్లు రెండు చోట్ల ఉంటే, ఇష్టం ఉన్న చోట ఉంచుకునే అవకాశం ఓటర్లకు ఉందన్నారు. మెదక్ పట్టణం, గ్రామాల్లో ఓట్లు ఉంటే ఎక్కడ ఓట్లు ఉంచుకోవాలో ఓటర్ల ఇష్టం అని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉం డాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు ఆంజనేయులు, మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహమ్మద్ అలీ, సంతు, ప్రదీప్, ఆర్కే శ్రీనివాస్, జూబేర్ పాల్గొన్నారు.
బల్దియాలో క్యాడర్ జాగ్రత్తగా ఉండాలి
మున్సిపల్ పరిధిలో ఓట్లు తొలిగించకుండ బీఆర్ఎస్ క్యాడర్ జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సూచించారు. పట్టణంలో కొందరు ఇండ్లు మార్పు చేస్తారని, కొందరు గ్రామాల్లోకి వెళ్లినా తొలిగించేందుకు కుట్ర చేస్తారన్నారు. పట్టణాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, బీఎల్వోలతో మాట్లాడి ఓట్లు పోకుండా జాగ్రత్తగా వ్యవరించాలన్నారు. బీఎల్వోలు వచ్చినప్పడు పూర్తి సమాచారం అందించాలన్నారు. ఓట్లను తొలిగించేందుకు కుట్ర జరుగుతున్నదని, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండి ఓట్లు పోకుండా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ఓట్లు పోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలఞఙని శేరి సుభాష్‌రెడ్డి అన్నారు.
-మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
ఓటరు ఫారాలు పరిశీలించి పూర్తిచేయాలి
సర్ కార్యక్రమంలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు పాల్గొని ఓటరు ఫారాన్ని పరిశీలించి పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ సూచించారు. బీఎల్వోలను ఆడిగి ఓటరు ఫారం పూర్తి చేయాలని, తప్పులతో పూర్తి చేయరాదని సూచించారు. కేసీఆర్ ఆదేశాలు ప్రతి ఒక్కరూ అమలు చేయాలని, ఓటరు జాబితాలో పేర్లు పోకుండా చూడాలన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్ పేరుతో ఓట్లను తొలిగించేందుకు కుట్ర చేస్తున్నదని, అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసీఆర్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఫరూఖ్ హుస్సేన్ ధీమా వ్యక్తం చేశారు.
-మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

