రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో వడ్లు కొనడం లేదని ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం అంబాజిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
- ముందు ధాన్యాన్ని తూకం వేస్తే రాజయ్య ఆత్మహత్య చేసుకునేవాడు కాదు
- ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
- మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం
- మెదక్ మార్చురీలో రాజయ్య మృతదేహం పరిశీలన
చిన్నశంకరంపేట, మే 21: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో వడ్లు కొనడం లేదని ఆత్మహత్య చేసుకున్న రైతు రాజయ్య కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం అంబాజిపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
మెదక్ ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న రాజయ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు రాజయ్యది ఆత్మహత్య కాదని, సర్కార్ హత్యేనని విమర్శించారు. రాజయ్య ధాన్యాన్ని ముందు తూకం వేసి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు కాదన్నారు. ఇప్పుడు తూకం వేస్తే ఏమి ప్రయోజనమని అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలలు గడుస్తున్నా తూకం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు సమీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను ఎందుకు పంప డం లేదని డీసీవో కరుణాకర్‌ను ప్రశ్నించారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రానికి లారీలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్, సర్పంచ్‌లు సిద్ధిరాములు, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, శ్రీను, పోచయ్య, దయానంద్ యాదవ్, నాగరాజు, లక్ష్మణ్‌రాజు, మోహన్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

