నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) మండల పరిధిలోని ఆవంచలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement Center) అధికారులు ఎట్టకేలకు ప్రారంభించారు. రైతులు నెలరోజులుగా వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వాటిని తూకం వేయడం లేదని నమస్తే తెలంగాణ దినపత్రికలో వరుస కథనాలు రావడం జరిగింది. ఈనెల 5వ తేదీన వాళ్ల ధాన్యం వచ్చేదాకా కొనరా అనే కథనం ప్రచురితం కావడం జరిగింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు సిబ్బంది మంగళవారం నాడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుండి ధాన్యాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపారు.