నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట జిల్లా, జూన్ 8 : నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సోమవారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు.
సిద్దిపేట జిల్లా కేంద్రం తోపాటు పలు పట్టణాల్లో చేపల విక్రయాలు భారీగా జరిగాయి. కొర్రమీను కిలో ధర రూ.450 నుంచి రూ. 500 ఉండగా బంగారు తీగ, బురదమట్ట, బొచ్చ చేపలు కిలో రూ.150 నుంచి రూ. 200, బొంగు రొయ్య (పెద్ద రొయ్యలు) చేపప్రియులను ఆకట్టుకున్నాయి.