పాపన్నపేట్,సెస్టెంబర్1: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మంజీరా నది పొంగిపొర్లుతున్న ది. దీంతో వనదుర్గప్రాజెక్టు పరవళ్లు తొక్కుతూ దుర్గామాత ఆలయం ముందు నుంచి నిజాంసాగర్ వైపు పరుగులిడుతున్నది. ఆదివారం ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని మూసి వేశారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు చేశారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసు సిబ్బందితో ఏడుపాయలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్‌తోపాటు ఏడుపాయల సిబ్బందితో సమీక్షించారు.