మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదర్శనలో రూపకల్పన చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ప్రాజెక్టులు జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి వరకు పోటీపడే అవకాశం ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరానికి రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణా సంస్థ మార్చి 3వ వారంలో వర్చువల్ పద్ధతిలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లా నుంచి విద్యార్థులు పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నా రు. జిల్లాస్థాయి అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గోనే అవకాశం ఉంటుంది.
లక్ష్యం ఇలా..
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లోని మేదస్సును వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఎంచుకున్న ప్రయోగాన్ని గైడ్ ఉపాధ్యాయుడి సహకారంతో తయారు చేసి ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. వైజ్ఞానిక ప్రదర్శనల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రమే అవకాశం కల్పించారు.
అంశం: సాంకేతిక మరియు బొమ్మలు
ఉప అంశాలు: పర్యావరణ హితమైన పదార్థాలు, ఆరో గ్యం పరిశుభ్రత, సాప్ట్వేర్ యాప్స్, రవాణా, పర్యావరణ, వాతావరణ మార్పులు, గణిత నమూనాలు.
ఎంపికలు ఇలా..
జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ప్రాజెక్టు ఎంపికైతే ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. జాతీయ స్థా యిలో ఉత్తమమైనదిగా ఎంపికైతే పేటెంట్ హక్కు దక్కే అవకాశం ఉంటుంది. గైడ్ ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే విద్యార్థులను వైజ్ఞానిక ప్రదర్శనకు సిద్ధం చేయాలి.
ఇంటర్నెట్లో నమోదు..
జవహార్లాల్ నెహ్రూ జాతీయ సామాన్య, గణితం పర్యావరణ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ఇంటర్నేట్ ద్వారా సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉన్నత పాఠశాలలో చదివే ప్రభుత్వ, ప్రైవేట్, కస్తుర్బా, ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు అర్హులు. ఎన్సీఈఆర్టీ సూచించి అంశాలకు సంబంధించి గైడ్ ఉపాధ్యాయుడి సహాయంతో ఈ నెల 15వ తేదీ వరకు నమోదు చేయాలి.
విద్యార్థుల సృజనను వెలికి తీసేందుకే..
విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెం పొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహదపడుతాయి. విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టులు శాస్త్రపరంగా ఉండాలి. వైజ్ఞానిక ప్రదర్శన ల్లో పర్యావరణానికి పెద్దపీట వేయ డం జరుగుతున్నది. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి.
– రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి