నిజాంపేట, అక్టోబర్ 2: మండల కేంద్రం నిజాంపేటలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సోమవారం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ జెండా ను ఎగురవేశారు. కార్యక్రమానికి నిజాంపేట మండల బీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్‌లు అనూష, చంద్రవర్ధిని, గేమ్‌సింగ్, అమరసేనారెడ్డి, అరుణ్‌కుమార్, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, సురేశ్, లహరి, నిజాంపేట, కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్లు బాపురెడ్డి, కొండల్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు అబ్దుల్ఆజీజ్, నాయకులు లక్ష్మీనర్సింహులు, మహేశ్, లక్ష్మణ్, రాములు, ఎల్లం, రాజు, రాజ్‌గోపాల్ తదితరులున్నారు.