ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. దీంతో వ్యాయామం చేసేందుకు వచ్చిన వారికి అసౌకర్యం తప్పడం లేదు. సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్‌పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ వస్తువులు దెబ్బతిని మూలకు పడ్డాయి. వాటికి మరమ్మతులు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో కూడా వ్యాయామ వస్తువులు దెబ్బతిన్నాయి.