మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి- నాందేడ్ జాతీయ రహదారిపై అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో గురువారం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.