సంగారెడ్డి, సెప్టెంబర్ 10: పేరుకు సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీ..వర్షం వస్తే కాలనీలు, రహదారులు, పార్కులు వరదనీటిలో మునిగిపోవాల్పిందే. ముంపుపై ముందుచూపి లేక పట్టణంలోని ఎర్రకుంట పరిధిలోని శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ, లాండ్ రికా ర్డ్స్ కాలనీలు నీట మునిగాయి. వర్షాలు వచ్చినా మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే చెరువులు, కుంటల్లో ఇండ్లు నిర్మించుకున్న వారి పరిస్థితి ముంపునకు గురికాకుండా ఉండేనని ఆయా కాలనీల వాసులు బోరుమంటున్నారు.
నాలాలకు మరమ్మతులు
వరదలో ఉన్న కాలనీల్లో అధికారులు హు టాహుటిన నాలాలకు జేసీబీలతో మరమ్మతులు చేయించి నీటిని తొలిగించారు. చెరు వు శిఖంలో నివాసాలు నిర్మించినందు వల్ల వరద ముంపునకు కారణమని అధికారులు తెలిపారు. శిఖంతోపాటు బఫర్జోన్లో ఇం డ్లు నిర్మించుకుని ఉండటం, కాల్వలను పూడ్చివేయడంతో వరద ముంపునకు గురవుతున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్లో ముంపునకు గురికాకుండా చేపట్టాల్సి న చర్యలపై వెంటనే నివేదికలు తయారు చేయాలని సంబంధిత స్థానిక అధికారులను ఆదేశించారు.