రామాయంపేట, మార్చి27 : అక్రమంగా సుక రవాణా చేసినా, ఇసుక నిల్వల ను ఉంచినా కేసులు నమోదు చేస్తామని రామాయంపేట తహసీల్దార్ రజినీ కుమారి, ఎస్సై.బాలరాజులు హెచ్చరించారు. గురువారం అర్ద్రరాత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీ అధేశాల మేరకు రామాయంపేట పట్టణ శివారులోని అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తమ ఇళ్లకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
ఇసుకాసురులు అక్రమంగా ఇసుక డంపు లను నిర్వహించి సొమ్ము చేసుకోవాలంటే ఇక కుదరదన్నారు. ఎంతటి వారైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మూడు ఇసుక నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పూర్తి విచారణ చేపట్టి వారికి నోటీసులు అందజేస్తామన్నారు.