న్యాల్కల్, ఆగస్టు1: సంగారెడ్డి జిల్లా న్యా ల్కల్ మండలం నిమ్జ్ పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే భూసేకరణ చేపట్టిన విష యం తెలిసిందే. అందులోభాగంగానే మండలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం మల్గి, డప్పూర్, వడ్డి గ్రామాల శివారులో రెండు వేల ఎకరాల్లో భూము లు సేకరించేందుకు పరిశ్రామశాఖ, రెవెన్యూ అధికారులు సర్వేలు చేపట్టారు.
ఆయా గ్రా మాల శివారులో దాదాపు 1400 ఎకరా ల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో 400 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధితశాఖాధికారులతో కలిసి వడ్డి, డప్పూర్, మల్గి గ్రా మాల శివారులోని భూములను పరిశీలించి భూమి వివరాలను తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు భూముల సర్వేపై ఆరా తీశారు. మరో 20 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మల్గి శివారులోని గుట్టపై పురాతన ఆలయాలు ఉన్నాయని, అక్కడ భూమిని సేకరించవద్దని మాజీ సర్పంచ్ మారుతీయాదవ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సి ద్ధారెడ్డి కలెక్టర్‌ను కోరారు. తొలిసారిగా వచ్చిన కలెక్టర్‌కు డప్పూర్, మల్లి మాజీ సర్పంచ్‌లు రవికుమార్, మారుతీయాదవ్ పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమె వెంట టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్‌రాథోడ్, జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లు నాగలక్ష్మి, రవీందర్‌రెడ్డి, జహీరాబాద్ ఆర్డీవో రాజు, ల్యాం డ్ సర్వేయర్ ఐలేశ్, డిప్యూటీ సర్వేయర్ భిక్షపతి, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు, తహసీల్దార్ రాజిరెడ్డి, నిమ్జ్ డిప్యూటీ తహసీల్దార్ జనార్దన్ ఉన్నారు.