సంగారెడ్డి, డిసెంబరు 29 : జిల్లాలో రేషన్ దుకాణాలు నడుపుతున్న డీలర్లకు అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం 5 కేజీల సిలీండర్ల అమ్మకానికి మార్గదర్శకాలు జారీ చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. గురువారం జిల్లా రేషన్ డీలర్ల సం ఘం, డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు కొత్తగా ఫోర్టిఫైడ్ రైస్‌ను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు.
డీలర్లతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలను విసృతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారని పేర్కొన్నారు. డీలర్లకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు 5కేజి సిలిండర్లు, పీఎం-డబ్ల్యూఎన్ఐ సేవలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దేశంలో పోషకాహార లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వంతో విటమిన్లతో కూడి న ఫోర్టీ ఫైడ్ రైస్‌ను రేషన్ దుకాణాలతో బలవర్దక ఆహార ధాన్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు వివిధ సేవలు చౌక ధరల దుకాణాల డీలర్లు ఉపయోగించుకుంటే అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.
దీంతో పాటు 5కేజీ సిలిండర్లు అమ్మకంతో డీలర్లు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. అందుకోసం జిల్లాలోని అన్ని చౌక ధరల దాకాణాల డీలర్లు ప్రభుత్వ సేవలను వినియోగించుకుని అదనపు ఆదాయం పొందాలని అదనపు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వనజాత, ఏసీఎస్ఓ నిత్యానందం, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజరు సుగుణబాయి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ సీనియర్ మేనేజర్ వెంకట్రావు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంగారెడ్డి బ్రాంచ్ సీనియర్ మేనేజరు రాంజీ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంగారెడ్డి బ్రాంచ్ మేనేజరు కవిత, బిఎస్ఎన్ఎల్ ఏజీఎం లక్ష్మణ్ బానొత్, హెచ్‌పీసీఎల్ సంగారెడ్డి ఏరియా సెల్స్ మేనేజరు శివకృష్ణ, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటీ రాజు, అనంతయ్య, కార్యవర్గ సభ్యులు డీలర్లు పాల్గొన్నారు.