లెక్క తేలింది.. ఓటరు జాబితా విడుదల
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. మెదక్ జిలాల్లో ఓటర్లు 4,34,275 మంది ఉన్నట్లు తేలింది.
- సంగారెడ్డి జిల్లాలో 13,55,958 మంది ఓటర్లు
- మహిళల కంటే పురుష ఓటర్లు అధికం
- పురుష ఓటర్లు 6,83,076, మహిళా ఓటర్లు 6,72,757
- ఎన్ఆర్ఐ ఓటర్లు 74 మంది, సర్వీసు ఓటర్లు 354
- జిల్లాలో 30-39 వయస్సు ఓటర్లు అత్యధికం
- సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1594 పోలింగ్ కేంద్రాలు
- మెదక్ జిల్లాలో 4,34,275 మంది ఓటర్లు
- మెదక్ నియోజకవర్గంలో 2,14,064
- నర్సాపూర్ నియోజకవర్గంలో 2,20,211
- జిల్లాలో మహిళా ఓటర్లు 14,440 మంది అధికం
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. మెదక్ జిలాల్లో ఓటర్లు 4,34,275 మంది ఉన్నట్లు తేలింది. గత ఆగస్టులో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 4,16,680 మంది ఉండగా.. ప్రస్తుతం 4,34,275 మందికి పెరిగింది. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలు, నియోజవర్గ కేంద్రాలు, పోలింగ్ బూతుల్లో ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 13,55,958 మంది ఓటర్లు
సంగారెడ్డి అక్టోబర్ 4 (నమస్తేతెలంగాణ): సం గారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుదిజాబితాను విడుదల చేసింది, జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55, 958కి చేరుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. వీరిలో పురుష ఓటర్లు 6,83, 076 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 6,72, 757 మంది ఉండగా థర్డ్‌జెండర్ ఓటర్లు 125 మంది ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఓటర్లు 74 మంది, సర్వీసు ఓటర్లు 354 మంది ఉన్నారు. మహిళల కంటే పురుష ఓటర్లు 10,319 మంది ఎక్కువగా ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం లో అత్యధికంగా 3,80,948 మంది ఓటర్లు ఉన్నారు. అతితక్కువగా నారాయణఖేడ్ నియో జకవర్గంలో 2,27,232 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 30నుంచి 39 వయస్సు ఉన్న ఓటర్లు 4,29,124 మంది ఉన్నారు.
ఐదు నియోజకవర్గాల్లో…
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 2,27,232 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,14,570 మం ది పురుష ఓటర్లు, 1,12,654 మంది మహిళా ఓటర్లు, ఎనిమిది మంది థర్డ్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. అందోలు నియోజకవర్గంలో మొత్తం 2,44,710 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,20,572 మంది పురుష, 1,24,133 మంది మహిళ, ఐదుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,732కు చేరుకుంది. పురుష ఓటర్లు 1,33,312, మహిళా ఓటర్లు 1,31,419, థర్డ్‌జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 2,38,836 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,18,265 పురుషులు, 1,20,037 మంది మహిళలు, 34 మంది థర్డ్జెండర్లు ఉన్నా రు. సంగారెడ్డి నియోజకవర్గంలో మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే 1772 మంది ఎక్కువగా ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా ఓటర్ల సంఖ్య ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం 3,80,948 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,96,357 మం ది పురుష, 1,84,514 మంది మహిళా, 77 థర్డ్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.
1594 పోలింగ్ కేంద్రాలు
జిల్లాలో 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 296, అందోలులో 313 సంగారెడ్డిలో 281, పటాన్చెరులో 391, జహీరాబాద్‌లో 313 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయనుంది. జిల్లాలో ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ 1594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మెదక్ జిల్లాలో 4,34,275 మంది ఓటర్లు
మెదక్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో 4,34,275 మంది ఓటర్లు ఉన్నట్లు కేం ద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను బుధవారం విడుదల చేసింది. ఆగస్టులో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 4,16,680 మంది ఉండగా, ప్రస్తుతం 4,34, 275కు పెరిగింది. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మెదక్ ని యోజకవర్గంలో 274 పోలింగ్స్టేషన్లు ఉండగా, పురుష ఓటర్లు 1,02,340 మంది, మహిళా ఓటర్లు 1,11,720 మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు నలుగురు ఉన్నారు. మొత్తం 2,14,064 మంది ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 305 పోలింగ్ స్టేషన్లు ఉండగా, పురుష ఓటర్లు 1,07,587మంది, మహిళా ఓట ర్లు 1,12,617మంది థర్డ్ జెండర్లు ఏడుగురు ఉన్నారు. మొత్తం 2,20, 211 మం ది ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రెండు నియోజకవర్గాల్లో 4,34,275 మంది ఓటర్లు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

