జహీరాబాద్, నవంబర్ 15: నిమ్జ్‌లో భూములు కోల్పోయిర రైతులు, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించకుండా అభివృద్ధ్థి పనులు చేపట్టడంపై బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం జహీరాబాద్‌లోని నిమ్జ్ కార్యాలయం, ఆర్డీవో ఆఫీస్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిమ్జ్ బాధిత రైతులు, వ్యవసాయ కూలీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రామచందర్ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులు, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించాలన్నారు.
అధికారులు వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి పనులు పేరిట రోడ్లు, మొక్కలు నాటడం,లెవలింగ్ పనులు చేయడం, బోర్డులు పెట్టడం, రైతులు, కూలీలను రానివ్వకుండా అడ్డుకోవడం తగదన్నారు. రైతులు, కూలీలకు పునరావాసం కల్పించిన తర్వాతే సేకరించిన భూముల్లోకి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలను అధికారులు విస్మరించడం మంచిది కాదన్నారు. బాధితులకు న్యాయం చేయకుంటే ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ఆయన అన్నారు. ఆందోళనలో నాయకులు శంకర్, కిష్టన్న, బాలయ్య, సిద్ధిరామయ్య, కూలీలు లక్ష్మి, సరస్వతీ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిపాలనకు కేంద్ర బిందుమైన కలెక్టరేట్ కంపుకొడుతున్నది. సిద్దిపేట సమీకృత కలెక్టరేట్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తున్నది. డస్ట్‌బిన్‌లో ఉండాల్సిన చెత్త కార్యాలయంలోని కారిడార్‌లో అందరూ తిరిగే చోట కనిపిస్తున్నది.
కలెక్టరేట్లోని మత్స్య శాఖ అధికారి కార్యాలయ సమీపంతో పాటు వివిధ కార్యాలయాల ముందున్న డస్ట్‌బిన్‌లో చెత్తను తీసివేయక పోవడంతో నిండిపోయి, కారిడార్‌పై ఎక్కడపడితే అక్కడ పడింది. వాటి తీయించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితులు అధ్వానంగా మారాయి.
– సిద్దిపేట, నవంబర్ 15