కంది, నవంబర్ 25: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం నికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించారు. దేశంలోనే మొదటి నికాన్ సెంటర్‌ను ఐఐటీహెచ్‌లో ప్రారంభించడం విశే షం. ఆధునిక సూక్ష్మచిత్రణ సాంకేతికతలతో పరిశోధకులకు సాధికారత కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్ ప్రారంభించారు. నికాన్ తాజా చిత్రీకరణ సాంకేతికత విద్యార్థుల పరిశోధనలకు అద్భుతమైన పరికరాలను అం దించనుంది.
ఇది ఒక వినోద కేం ద్రంగా, పరిశోధకులకు జీవ సంస్కృతులను వివిధ పరిణామాల్లో అన్వేషించడానికి శక్తిని అందిస్తుంది. ఒకే సెల్ నుంచి అధిక నిర్ధారిత చిత్రీకరణలో విజ్ఞానాలను సులభతరం చేస్తుంది. ఈ సందర్భంగా నికాన్ ఇండియా ఎండీ సజ్జన్‌కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో విస్తృత శాస్త్ర సృష్టికి అత్యాధునిక సూక్ష్మచిత్రణ వ్యవస్థను పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. శాస్త్ర పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాకుండా వివిధ శాస్త్ర విభాగాల్లో పరిశోధకులు, విద్యార్థుల సృజనాత్మకతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్‌మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీహెచ్‌లో నికాన్ ఇం డియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ అన్వేషణాత్మక పరిశోధన, వివిధ అభ్యాస అవకాశాలను ప్రోత్సహించేందుకు దోహదపడుతుందన్నారు. అకాడమిక్, పరిశోధన విభాగాల్లో ఈ కేంద్రం పరిశోధకులు, విద్యార్థులకు సాధ్యమైన సరిహద్దులను సవాల్ చేసే వీలుతో పాటు భవిష్యత్తు శాస్త్రవేత్తల బలమైన సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. కార్యక్రమంలో నికాన్ ఇండియా సభ్యులు ఎకీ వాకామియా, కాజుటాక వాతమహే, డెబ్ శేఖర్, మహావీర తన్వార్, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.