చెల్లని చెకులు..లబ్ధిదారులకు చిక్కులు!
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు చెకులు అందినా అవి నగదుగా మారకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ సోమవారం అందజేశారు.
- కాలపరిమితి ముగిసిందంటూ బ్యాంకుల తిరసరణ
- సిద్దిపేట జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం
- ఇబ్బందులు పడుతున్న పేదకుటుంబాలు
- కల్యాణలక్ష్మి చెకులు చేతికొచ్చినా.. బ్యాంకుల్లో నగదు అందని ద్రాక్షే..
సిద్దిపేట, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు చెకులు అందినా అవి నగదుగా మారకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట నియోజకవర్గం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ సోమవారం అందజేశారు. దాదాపు సిద్దిపేట నియోజకవర్గంలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కలు పంపిణీ చేశారు. వీటిలో కాలపరిమితి ముగిసిన చెక్కులు సైతం ఉండడంతో అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.
సిద్దిపేట మున్సిపాలిటీ ఇమాంబాద్ గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు మంత్రి చేతుల మీదుగా చెకు అందుకుని సంతోషంగా బ్యాంకుకు వెళ్తే అకడ ఊహించని షాక్ తగిలింది. చెకుల గడువు ముగిసిందని బ్యాంకు అధికారులు వాటిని తిరసరిస్తుండడంతో పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్యాంకుకు వెళ్తే కాలపరిమితి ముగిసింది, మరో చెక్ రాయించుకోండని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.అధికారులు ఇలా కాల పరిమితి ముగిసిన చెక్కులు అందించడం ఎంత వరకు కరెక్ట్ అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

ఇలా కాల పరిమితి ముగిసిన చెక్కులు ఎన్ని ఉన్నాయో ..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చెకులపై ఉన్న చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత వాటిని పంపిణీ చేయడం వల్ల బ్యాంకులు వాటిని నగదుగా మార్చేందుకు నిరాకరిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో చెకు చేతిలో ఉన్నా డబ్బు అందని పరిస్థితి నెలకొంది.పెండ్లి ఖర్చుల కోసం అప్పులు చేసిన కుటుంబాలు ఈ సాయంపై ఆశలు పెట్టుకున్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త చెకులు ఎప్పుడు ఇస్తారు, సమస్య ఎప్పుడు పరిషారం అవుతుందో తెలియక అయోమయంలో ఉన్నామని వాపోతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గడువు ముగిసిన చెకులను రద్దు చేసి కొత్త చెకులు జారీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను మరింత ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే సమస్య పరిషరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

