5 జిల్లాల నుంచి 550 మంది కెడెట్లు హాజరు
నేడు బీ సర్టిఫికెట్ థియరీ పరీక్షలు
సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 26 : ఎన్సీసీ వార్షిక పరీక్షలు తారా ప్రభుత్వ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమయ్యాయి. 33టీ బెటాలియన్‌కు సంబంధించి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 550 మంది కేడెట్లు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షలో భాగంగా బీ సర్టిఫికెట్‌కు సంబంధించిన నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో 290 మంది పాల్గొన్నారు. ఇందులో వెపన్, మ్యాప్ రీడింగ్, ఎఫ్సీబీసీ తదితర అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 33(టీ) బెటాలియన్ అధికారి కల్నల్ ఎస్కే సింగ్ మాట్లాడుతూ 5జిల్లాకు చెందిన కెడెట్లకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
తొలి రోజు బీ సర్టిఫికెట్ ప్రాక్టికల్స్, రెండో రోజు ఆదివారం థియరీ పరీక్ష, సీ సర్టిఫికెట్ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ పరీక్షల పరిశీలన అధికారిగా హాజరైన నిజామాబాద్ రేంజ్ బెటాలియన్ అధికారి ఆర్ఎస్ రాథోడ్ ఆయా పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు కుల్దీప్ సింగ్, మనోజ్ కుమార్, కరుణాకర్, కృష్ణ ప్రియ తదితరులు పాల్గొన్నారు.