సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 8: నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బీ.అనురాధ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న పరీక్ష కోసం జిల్లాలో 7 కేంద్రాలు ఎంపికయ్యాయని, సెంటర్ నుంచి 500 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడవద్దని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పరీక్ష జరిగే సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో సెయింట్ మేరీస్ విద్యానికేతన్, ప్రజ్ఞాపూర్, సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూల్, గజ్వేల్, తెలంగాణ మోడల్ స్కూల్ సంగాపూర్ రోడ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్, జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్, గవర్నమెంట్ హైస్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్, జిల్లా పరిషత్ హైస్కూల్ బాయ్స్, ప్రజ్ఞాపూర్, జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒక గంట ముందే చేరుకొని, మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.