Revanth Reddy | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంత ప్రతిష్టాత్మకంగా అమలయ్యాయో తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ పాలనలో అలాంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం జరుగుతుందో తెలిపేందుకు తాజా వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యమనడంలో ఎలాంటి సందేహం లేదు.
నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మహిళలు తిట్టిపోస్తున్నారు. ఓ మహిళ ఆగ్రహంతో ఊగిపోతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు రూ.2500 ఇస్తనని ఇవ్వలేదు.. పెన్షన్లు పెంచుతా అని చెప్పి పెంచలేదు. ఆంధ్రలో పెన్షన్లు పెంచారు నువ్వు ఎందుకు పెంచలేదు.. అధికారంలోకి వచ్చాక నువ్వేం పెంచినవ్.. గదే రూ. 2 వేలు ఇచ్చినవ్.. చాతకాని ముసలోళ్లున్నరు.. కేసీఆర్ పెన్షన్ పైసలు ఇంటికి పంపించిండు.. పదేళ్లు బంగారమోలే చేసిండు. మా భూపాల్ రెడ్డి మంచోడు కాబట్టే మళ్లీ సర్పంచ్‌గా గెలిపించుకున్నం. ఎవరైనా మంచోడిని తెచ్చుకుంటం.. చెడ్డోన్ని తెచ్చుకుంటమా.. అంటూ ఫైర్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రేవంత్ రెడ్డి పాలనపై మహిళల ఆగ్రహం
ఆంధ్రలో పెన్షన్లు పెంచారు నువ్వు ఎందుకు పెంచలేదు అంటూ ఆగ్రహం
నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న మహిళలు pic.twitter.com/tazEsoiCPc
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
Medak | టీ పాయింట్, హార్డ్‌వేర్ షాప్‌ను ప్రారంభించిన పద్మాదేవేందర్ రెడ్డి