Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్ మెన్స్ షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో ఇండియా పోడియం స్వీప్ చేసింది. ఈ వెంట్‌కు చెందిన మూడు మెడల్స్ ఇండియన్ అథ్లెట్లకే దక్కాయి. సచిన్ ఖిలారి స్వర్ణ పతకం గెలుచుకోగా, మొహమ్మద్ యాసిర్, పర్వీన్‌కు .. వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి.
నగోయా: ఏషియన్ పారా గేమ్స్(Asian Para Games)లో భారత్ విజృంభిస్తోంది. మెన్స్ షాట్‌పుట్ ఎఫ్46 ఈవెంట్లో ఇండియా పోడియం స్వీప్ చేసింది. ఆ ఈవెంట్‌కు చెందిన మూడు మెడల్స్ ఇండియన్ అథ్లెట్లకే దక్కాయి. మెన్స్ షాట్‌ఫుట్‌లో సచిన్ ఖిలారి, మొహమ్మద్ యాసిర్, పర్వీన్ .. వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. పారాలింపిక్ మెడలిస్ట్ సచిన్.. ఏషియన్ గేమ్స్‌లో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. షాట్ఫుట్ను 15.87 మీటర్ల దూరం విసిరి గేమ్స్‌లో కొత్త రికార్డును స్థాపించాడు. యాసిర్ 15.06 మీటర్లు, పర్వీన్ 14.94 మీటర్ల దూరం విసిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో ఖిలారి సిల్వర్ మెడల్ గెలిచాడు. అయితే చైనాలో జరిగిన గత ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టిన సచిన్ ఈసారి ఆ మెడల్‌ను డిఫెండ్ చేసుకున్నాడు. ఆరవ, ఏడవ అటెంప్ట్‌లో సచిన్ 15.87మీటర్ల దూరం విసిరి గేమ్స్ రికార్డు క్రియేట్ చేశాడు.
మూడో రోజు కూడా ఇండియాకు పతకాల పంట పండుతోంది. ప్రస్తుతం భారత బృందం పతకాల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఇండియాకు 47 మెడల్స్ దక్కాయి. దీంట్లో 12 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్య పతకాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
UPI Payments | UPIలో పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? వెంటనే ఇలా చేయండి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

