మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
మెదక్, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ ) : మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

