Manne krishank | ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ నుంచి మనకేమన్నాపెట్టుబడులు వచ్చినయా..? : మన్నె క్రిశాంక్
Manne krishank | కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనే కొత్త కంపెనీకి కూడా చైర్మన్ అయ్యాడు.. ఆయన అంత పెద్ద సైంటిస్టా మరి..? అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
Manne krishank | రేవంత్ రెడ్డి ఈ సంవత్సరంలోనే దావోస్‌కు వెళ్లినప్పుడు ఇజ్రాయెల్ ఇన్నోవేటివ్ అథారిటీ వాళ్లను కలిశారు. నిజంగానే ఇజ్రాయెల్ ఇన్నోవేటివ్ అథారిటీ నుంచి మనకేమన్నా పెట్టుబడులు వచ్చినయా..? తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా అంటే శూన్యమని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు.. కానీ ఒక్క కంపెనీతో మాత్రం ఒప్పందం చేసుకున్నరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంత కష్టపడి ఇక్కడి నుంచి ఫారిన్‌కు వెళ్లి ఇజ్రాయెల్ అధికారులను కలిస్తే వాళ్లు చేసుకున్న ఒప్పందం టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్.
రేవంత్ రెడ్డి చెప్తే ఇజ్రాయెల్ వాళ్లు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు. అప్పుడే ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారితో రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా భేటీ అయ్యాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెస్సెరాక్ట్ కంపెనీకి తక్కువ ధరలో భూములు కట్టబెడితే.. శ్రీధర్ బాబు వచ్చి కొండల్ రెడ్డికి, టెస్సెరాక్ట్ కంపెనీకి సంబంధం లేదు అని అంటున్నాడు. కొండల్ రెడ్డి ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అనే కొత్త కంపెనీకి కూడా చైర్మన్ అయ్యాడు.. ఆయన అంత పెద్ద సైంటిస్టా మరి..? అని ప్రశ్నించారు.
ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి. ఇజ్రాయెల్‌తో ఒప్పందం ఎలా చేసుకుంటారని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించాడు. మరి మీ ముఖ్యమంత్రి తమ్ముడు ఇజ్రాయెల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అనుముల కొండల్ రెడ్డి, ఫహీం కురేషి విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.
తెలంగాణకు ఏమో ఒక్క కంపెనీ రాదు.. రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కొండల్ రెడ్డి ఏ దేశానికి పోయినా ఆయనతో మాత్రం అక్కడ అధికారులు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హవాలానా, షెల్ కంపెనీలా, నల్లధనమా.. దేనికోసం వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి చెప్తే ఇజ్రాయెల్ వాళ్ళు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారు
రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం దావోస్‌కి వెళ్లి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్లని కలిస్తే.. వాళ్లు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు… pic.twitter.com/mw46L9Lmf0
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
Read Also :
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

