CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
CM Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు మూడు గంటల పాటు నిర్బంధించారు. దీంతో పాటు సీఎం భగవంత్‌కు సుమారు 50వేల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తోంది. పారిస్ టూరు నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
చండీఘడ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్(CM Bhagwant Mann)ను ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు మూడు గంటల పాటు నిర్బంధించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అక్టోబర్ 19వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం భగవంత్‌కు సుమారు 50వేల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తోంది. పారిస్‌లో జరిగిన ఫుడ్ ట్రేడ్ సదస్సు నుంచి తిరిగి వస్తున్న సమయంలో సీఎం మాన్‌ను ఢీల్లీ విమానాశ్రయంలో నిర్బంధించారు. సీఎం మాన్‌ను కేంద్రంలోని బీజేపీ అవమానించినట్లు ఆప్ నేత బల్తేజ్ పన్నూ ఆరోపించారు. ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న తర్వాత సీఎం మాన్‌ను ఆపారని, లాగేజీ వస్తోందని, చెక్ చేయాలని అన్నట్లు పన్నూ తెలిపారు. కావాలనే ఆయన్ను నిర్బంధించినట్లు ఆరోపించారు. మూడు గంటల తర్వాత విమానాశ్రయం నుంచి సీఎం భగవంత్ వెళ్తున్న సమయంలో.. అతనికి 50వేల ఛలాన్ జారీ చేసినట్లు పన్నూ ఆరోపించారు. పంజాబీల గౌరవాన్ని , గుర్తింపును దెబ్బతీసే రీతిలో బీజేపీ వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు చెందిన ఫ్రాన్స్ టూరుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో పంజాబ్ హైకోర్టు ఆదేశాలతో ఆయన పారిస్ ట్రిప్‌కు వెళ్లారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

