Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Rob Jetten | ప్రపంచంలోనే తొలి స్వలింగ సంపర్క ప్రధానిగా చరిత్ర సృష్టించిన రాబ్ జెట్టెన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. సరోగసీ ద్వారా ఆయన ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.
Rob Jetten | ప్రపంచంలోనే తొలి స్వలింగ సంపర్క ప్రధానిగా చరిత్ర సృష్టించిన రాబ్ జెట్టెన్ వ్యక్తిగత జీవితంలోనూ ఓ మధుర ఘట్టం ఆవిష్కృతం కానుంది. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ (39), ఆయన భాగస్వామి, అర్జెంటీనా అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. సరోగసీ (అద్దె గర్భం) ద్వారా తమకు తొలి బిడ్డ జన్మించబోతున్నట్లు ఈ జంట తాజాగా వెల్లడించింది. 2027లో తమ జీవితాల్లోకి చిన్నారి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంది.
‘‘మా జీవితాల్లోకి ఓ ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. చిన్నారి.. 2027లో కలుద్దాం. మా అండదాతకు, సరోగసీ తల్లి లీసాకు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు’’ అంటూ రాబ్ జెట్టెన్, నికోలస్ కీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. కాగా, నెదర్లాండ్స్‌లోనే ఐవీఎఫ్ (IVF) చికిత్స ద్వారా గర్భధారణ ప్రక్రియ పూర్తయిందని, దేశ నిబంధనలకు అనుగుణంగానే ఈ ఏర్పాట్లు జరిగినట్లు జెట్టెన్ పార్టీ డెమోక్రాట్స్ 66 (D66) వెల్లడించింది.
ఈ బిడ్డ కోసం నెదర్లాండ్స్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు డెమోక్రాట్స్ 66 తెలిపింది. వారిలో ఒకరు అండాన్ని దానం చేయగా.. మరొకరు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ముందుకొచ్చారని పేర్కొంది. ఈ సహకారాన్ని ఎలాంటి వాణిజ్య ప్రయోజనం ఆశించకుండా అందించినట్లు చెప్పింది. నెదర్లాండ్స్‌లో డబ్బు చెల్లించి సరోగసీ చేయించుకోవడం చట్టవిరుద్ధం.
పెళ్లి వాయిదా.. ఇప్పుడు బిడ్డ కోసం ఎదురుచూపులు
రాబ్ జెట్టెన్, నికోలస్ కీనన్ 2024 నవంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ.. జెట్టెన్ ప్రధాని అయిన తర్వాత పెళ్లిని వాయిదా వేసుకున్నారు. బిడ్డ జన్మించిన తర్వాత కుటుంబంతో గడిపేందుకు కొన్ని రోజులు సెలవు తీసుకుంటానని జెట్టెన్ భావిస్తున్నారు. అయితే, సుదీర్ఘకాలం తల్లిదండ్రుల సెలవు తీసుకునే ఆలోచన లేదని పార్టీ తెలిపింది. కాగా, 2001లో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

