Sunitha Laxma Reddy | శివ్వంపేట, మార్చి 3 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రాములు (45) అనారోగ్యంతో మృతిచెందారు. అతనికి సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో పాటు తోటి ఉద్యోగులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్ జోగు రాములు మృతి బాధకరమని సంతాపం వ్యక్తం చేశారు. ఏపీవో అనీల్‌కుమార్, ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు చింతస్వామి, నాయిని దామోదర్‌రెడ్డి, పోచాగౌడ్, కమ్మరి సురేశ్, సండ్ర సుధాకర్, పిల్లి మధు, బబ్బురి వెంకటేశ్ తదితరులు ఉన్నారు.