కగనల్, జూన్ 10 : కనగల్ మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠతోపాటు రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మహర్షి కల్యాణోత్సవాన్ని మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండువగా నిర్వహించారు. హంపి విరూపాక్ష విద్యారణ్య మహాస్వామి, నాగోజు మల్లాచారి, చిలుకమర్రి శ్రవణ్ కుమారాచార్యుల ఆధ్యర్యంలో వేడుకలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
కల్యాణోత్సవానికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఈఓ జల్లేపల్లి జయరామయ్యతో కలిసి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళల కోలాట ప్రదర్శన, జడకొప్పు, పోతరాజుల విన్యాసాలు అలరించాయి. ఈ సందర్భంగా 8 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులు అమ్మవారికి బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ప్రసిద్ధి చెందిందని, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, టీఆర్ఎస్ కనగల్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు చనగోని నాగరాజు, తాసీల్దార్ శ్రీనివాస్‌రావు, స్థానిక సర్పంచ్ అల్గుబెల్లి పూలమ్మ, నర్సింహారెడ్డి, ఎంపీటీసీ శైలజాసైదులు, ఆలయ అర్చకులు నాగోజుమల్లాచారి, చిలకమర్రి శ్రవణాచారి, ఫణి, నాగరాజు, మహేశ్, ఆలయసిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య, లింగయ్య, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు, ఆంజనేయులు, ధర్మకర్తలు చనగోని భిక్షం, బైరు నాగేశ్, పాలకూరి నాగరాజు, జినుకుంట్ల నర్సింహ, కంచరకుంట్ల రవీందర్‌రెడ్డి, నెలగొందరాశి సైదమ్మ, చనగోని యాదగిరి, మర్రి యాదగిరి, పుల్లెంల లక్ష్మయ్య, చనగోని సైదులు, చీదేటి నారాయణరెడ్డి, కడమంచి గణేశ్ పాల్గొన్నారు.