చేర్యాల, ఫిబ్రవరి 16: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, చేర్యాల మాజీ సర్పంచ్ ముస్త్యాల అరుణ శనివారం రాత్రి కలిశారు. ముస్త్యాల బాల్‌నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌కు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ప్రసాదాన్ని అందించారు. వారితో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, యూత్ ఇన్చార్జీ శివగారి అంజయ్య ఉన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
సిద్దిపేట, ఫిబ్రవరి 16: నారాయణరావుపేట మండలం శేఖర్‌రావుపేటలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు జరిగే పెద్దమ్మతల్లి ఉత్సవాలకు రావాలని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును ఆదివారం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.