Sakhi Centres | మెదక్, ఏప్రిల్ 30 : సఖి సెంటర్లో బాధితులకు అత్యుత్తమ సేవలు అందించాలని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి
వల్లేటి ప్రేమ్ చంద్ అధికారులకు నిర్దేశించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న సఖి- కేంద్రం, రెడ్డిపల్లి అంగన్వాడి సెంటర్ను నోడల్ అధికారి వల్లేటి ప్రేమ్ చంద్ తనిఖీ చేశారు. మెదక్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శనీయమని ఈ సందర్భంగా ప్రేమ్ చంద్ అన్నారు.
సఖి సెంటర్లో బాధితులకు అత్యుత్తమసేవలు అందాలని, మెదక్ జిల్లాలో అంగన్వాడీల పనితీరు ఆదర్శంగా ఉందనిపేర్కొన్నారు. ముందుగా సఖి సెంటర్లో రిజిస్టర్లను తనిఖీ చేస్తూ క్లిష్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు.అలాగే మహిళలు పని చేసే చోట కలిగే ఇబ్బందుల గుర్తించి మహిళలపై లైంగిక దాడి చట్టంపై కూడా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ను పరిశీలించి గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్నఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు.
పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలకు సంపూర్ణ పోషకాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, సంబంధిత అంగన్వాడి సీడీపీఓలు , అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.