రామాయంపేట, సెప్టెంబర్04 : పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపల్ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని రామాయంపేట పురపాలిక కమిషనర్ దేవేందర్, లయన్స్ క్లబ్ చైర్మన్ దేమె యాదగిరి అన్నారు. గురువారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దేవేందర్ చేతుల మీదుగా లయన్స్ క్లబ్ అధ్వర్యంలో కార్మికులకు బలాన్నిచ్చే పానీయాలను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పురపాలికలో ప్రజల కోసం ప్రతి రోజు మురికి కాల్వలు, చెత్తా చెదారాన్ని తొలగించే సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్నారు. కార్మికుల ఆరోగ్యం పట్ల లయన్స్ క్లబ్ రామాయంపేట సభ్యులు ఎనర్జి డ్రింక్స్‌ను అందించడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్సుక్లబ్ సభ్యులు లక్ష్మన్ యాదవ్, వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది ఆర్ఐ.శ్రీధర్‌రెడ్డి, కాలేరు ప్రసాద్, పోచమ్మల శంకర్, సురేష్ తదితరులు ఉన్నారు.