సంగారెడ్డి, ఆగస్టు 3: మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని, నిషేధిత గుట్కా, పాన్‌మసాలా, సిగరెట్ అమ్మకాలపై నిఘా పెట్టాలని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ ఆదేశించారు. శనివా రం సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎస్పీ చెన్నూ రి రూపేశ్ ఆయనకు స్వాగతం పలికారు. పోలీసు కార్యాలయంలో ఐజీ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. కార్యాలయ ఆవరణ, పోలీసు పరేడ్ మైదానాన్ని పరిశీలించారు.
అనంతరం ఎస్పీతో కలిసి సైబర్ ల్యా బ్, పోలీసు క్యాంటీన్, వాటర్ ప్లాంట్లను ప్రా రంభించారు. ఈ సందర్భంగా మీడియా తో ఐజీ మాట్లాడారు. జిల్లా ఇతర రాష్ర్టాలతో సరిహద్దులు కలిగి ఉండటంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు, శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడాలన్నారు. అన్ని ప్రధాన రోడ్లపై ప్రమాదాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు సంబంధిత యాజమాన్యాలతో మాట్లాడాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావ్, డీఎస్పీలు సత్తయ్యగౌడ్, రవీందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.