మహిళా సంక్షేమానికి సీఎం పెద్దపీట
రాజకీయాలకు అతీతంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శనివారం మండలంలోని మానేపల్లిలో జరిగింది.
- అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్
- బతుకమ్మ చీరల పంపిణీలో ఎంపీపీ స్వరూప
వెల్దుర్తి/చేగుంట/శివ్వంపేట/చిలిపిచెడ్/రామాయంపేట/మెదక్‌రూరల్, ఆక్టోబర్ 7: రాజకీయాలకు అతీతంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శనివారం మండలంలోని మానేపల్లిలో జరిగింది. సర్పంచ్ వెంకటలక్ష్మీ, ఈవో సురేందర్‌రెడ్డితో కలిసి ఎంపీపీ స్వరూప బతుకమ్మ చీరెలనుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆడపడుచుల ఆత్మగౌరవం పెంపొందించేందుకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నదని, కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, పండగ ఆనందాన్ని చిన్నాపెద్దా తేడాలేకుండా అందరికీ పం చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గత తొమ్మిదేళ్లుగా బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.

* తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందించడం జరుగుతుందని చం దాయిపేట ఉప సర్పంచ్ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. చేగుంట మండలపరిధిలోని చందాయిపేటలో శనివారం బతుకమ్మ చీరెలు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణ, వార్డు సభ్యులు రమ్య, సాయిబాబా, శోభన్, ప్రదీప్, సీఏలు పద్మ, స్వామి, జ్యోతితో పాటు పలువురు మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
* ఆడపడుచులకు ప్రభుత్వం కానుకగా అందజేస్తున్న బతుకమ్మ చీరెలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఉసిరికపల్లి సర్పంచ్ పోతరాజు బాబూరావు అన్నారు. శనివారం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మర్రి సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీఆర్టీయూ జిల్లా ప్రధా న కార్యదర్శి సిలువేరి వీరేశం, మహిళలు పాల్గొన్నారు.
* బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం కానుకగా చీరెలను అందజేస్తున్నదని రాందాస్‌గూడ సర్పంచ్ అంకం యాదగిరి అన్నారు. శనివారం మండల పరిధిలోని సోమక్కపేట, శీలాంపల్లి, ఫైజాబాద్ గ్రామాల్లో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆడపడుచులను గౌరవించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరెలను పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు స్రవంతీ లక్ష్మణ్, కవితాముకుందరెడ్డి, మనోహరనర్సింహారెడ్డి, గ్రామాల కార్యదర్శులు నగేశ్, నాగరాజు, భూమేశ్ మహిళలు పాల్గొన్నారు.
* తెలంగాణ ప్రభుత్వం తీరోక్క రంగులతో మహిళలు మెచ్చేలా బతుకమ్మల చీరెలను అందిస్తున్నదని రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఎంపీడీవో ఉమాదేవి, వైస్ ఎంపీపీ స్రవంతి పేర్కొన్నారు. శనివారం రామాయంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ భిక్షపతి చేతుల మీదుగా బతుకమ్మల సారెలను మహిళలకు అందజేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు మెచ్చేలా 250 డిజైన్లు గల చీరెలను అందించిందని, ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కానుకగా అందిస్తున్నదని తెలిపారు. మండలంలో 10,400 బతుకమ్మల చీరెలు రావడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికి బతుకమ్మల చీరెలు అందించడమే తమ లక్ష్యమన్నారు. అర్హులైన వారి ఆధార్‌కార్డు ఆధారంగా చీరెలను అందించడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో మండల సిబ్బంది, సర్పంచులు పాల్గొన్నారు.
* తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండగ కానుకగా చీరెలు అందజేస్తున్నదని సర్పంచ్ రాజ్యలక్ష్మీరవీందర్ అన్నారు. శనివారం మెదక్ మండల పరిధిలోని వెంకటపూర్‌లో సర్పంచ్ రాజ్యలక్ష్మి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలు బతుకమ్మ పండగను ఆనందోత్సాహాలతో జరుపుకొనేలా తండ్రిలా, పెద్దన్నలా, మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరెలను కానుకగా అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, నాయకులు రవీందర్ , అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

