చేగుంట, అక్టోబర్ 19 : తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరుతున్నట్లు ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో గురువారం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ నాయకులు వంద మంది పార్టీకి రాజీనామా చేసి ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దీంతో పాటు చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎంపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీన్ కుమార్, జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, ఇబ్రహీంపూర్ సర్పంచ్ దొరగొళ్ల రాములు, సొసైటీ మాజీ చైర్మన్ కోమండ్ల నారాయణరెడ్డి, రెడ్డిపల్లి వైస్ చైర్మన్ తీగుళ్ల ఆంజనేయులు, ఎగ్గడి శేఖర్ తదితరులు ఉన్నారు. మెదక్ ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కాంగ్రెస్ నాయకులు