దుబ్బాక, నవంబర్ 8: బీఆర్ఎస్ దుబ్బా క ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ దుబ్బాక మండల ఎన్నికల పరిశీలకుడు ఎల్లు రవీందర్‌రెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా బుధవారం దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్, హబ్షీపూర్ గ్రామాల్లో, అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేట, నగరం, తాళ్లపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మ్యానిఫెస్టోపై అవగాహన కల్పిస్తూ కారు గుర్తుకు ఓటేసి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్, దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చే ఝూఠా పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో మాయమాటలతో మోసిగించిన బీజేపీ రఘునందన్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కదన్నారు. సబ్బం డ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ సర్కారుకు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికే తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శాలివాహన(కుమ్మరి) కులస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అస్క రవి, తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి, సర్పంచ్‌లు శ్రీనివాస్, సద్ది, రాజిరెడ్డి, పరశురాములు, బీఆర్ఎస్ నాయకులు అబ్బుల రా జలింగంగౌడ్, పండారి లక్ష్మాణరావు, మహేశ్‌రెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, రాజిరెడ్డి, నారాగౌడ్, తిరుపతిరెడ్డి, కొంగరి రాజ య్య, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
పద్మనాభంపల్లిలో ఎల్లు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, యువజన సంఘాల వారు బీఆర్ఎస్లో చేరారు. హబ్షీపూర్‌లో సుమా రు 20 మంది యువజన సంఘాల సభ్యు లు కారెక్కారు. కార్యక్రమంలో దుబ్బాక ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పండారి లక్ష్మాణ్రావు, బీఆర్ఎస్ నాయకులు మహేశ్‌రెడ్డి, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.