చేగుంట, ఏప్రిల్ 6 : అధికారమే పరమావధిగా బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చేగుంట మండలం మక్కరాజిపేట గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ నాయకులు సీహెచ్ మొగులయ్య, కుమార్, లింగం, రాజయ్య, నాగరాజు, బీ శ్రీకాంత్, రెడ్డిపల్లి సిద్ధ్దిరాములు, కుమార్, గడ్డమీది శ్రీను, స్వామి, శంకర్, ఆర్ స్వామి, జింక నర్సింహులు,ఎల్లం, కె మల్లేశం, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీశై లం, యాదగిరి, చెన్నబోయిన కృష్ణ, పంబాల పెంటయ్య, లచ్చిరెడ్డి గారి తిరుపతి, మాసాని ప్రభాకర్, ఎక్కగారి భిక్షపతితో పాటు పలువురు ఎంపీ కొత్త ప్రభాకర్ సమక్షంలో గురువారం హైదరాబాద్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నరన్నారు.
దేశం గర్వించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే బండి సంజయ్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పదో తరగతి పరీక్ష పేపర్లను లీకేజీ చేయించారని ఆరోపించారు. మోదీ ఒక మాట అనగానే రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేశారని, బాధ్యతాయుత పదవిలో ఉండి పేపర్ లీక్‌లో భాగస్వామ్యం వహించి జైలుకు పోయిన బండి సంజయ్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాక అభివృద్ధి చేయని ఎమ్మెల్యే రఘునందన్‌రావు డీజీపీ మీద గుండా అని అనుచితంగా మాట్లాడటం సరికాదని, అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నాయకులు చేష్టలు చూసి సభ్య సమాజం చీదరించుకుంటున్నారని, నోరు తెరుస్తే దేశం కోసం,ధర్మం కోసం అని మాట్లాడే నాయకులు ఇలాంటి ఆధర్మ కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వారికి ప్రజలే తగిన బుద్ధ్ది చెప్పడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో చేగుంట జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల రైతు బంధు అధ్యక్షుడు జింక శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు బండి విశ్వేశ్వర్, మాజీ ఎంపీటీసీ బాల్ నర్సింహులు, రాజిరెడ్డి, సత్తిరెడ్డి, యాదవరెడ్డి, రాజిరెడ్డి, సురేశ్ రెడ్డి, ఇబ్రహీంపూర్ మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు ఉన్నారు.