సంగారెడ్డి జూలై 20 (నమస్తే తెలంగాణ): తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో శనివారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లా అం తటా రోజంతా ముసురు అలుముకుంది.ఎడతెరిపిలేకుండా వర్షపు చినుకులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో జనజీవనం కొంత స్తంభించింది. కొద్దిరోజులుగా జిల్లాలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా రైతులు సంతోషంగా ఉన్నారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వానకాలం పంటలకు ప్రాణం పోసినట్లు అయ్యింది. ము ఖ్యంగా వర్షాలతో పత్తిపంటకు ఎక్కువ లాభం చేకూరింది.
వర్షాలు లేక చాలా గ్రామాల్లో పత్తి ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వానకాలంలో రైతులు సాగు చేసిన పత్తి, పెసర, మినుము, కంది తదితర పంటలకు లాభం జరిగింది. గుమ్మడిదల మండలంలో అత్యధికంగా వర్షం కురిసింది. గుమ్మడిదలలో 2.8 సెం.మీటర్లు, సిర్గాపూర్‌లో 2.5 సెం.మీ, రామచంద్రాపురంలో 2.2 సెం.మీ, అమీన్పూర్, సిర్గాపూర్, జిన్నారంలో 2.1సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. చౌటకూరు మండలంలో రెండు సెం. మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 1.2 సెం.మీటర్ల నుంచి 1.90 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది.
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతున్నది. సోమవారం ప్రాజెక్టులోకి 391 క్యూసెక్కులు వచ్చాయి. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు సింగూరు ప్రాజె క్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 13.596 టీఎంసీల జలాలు ఉన్నాయి.
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 20: సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షం పడింది. దుబ్బాకలో 4.6 మి.మీటర్లు , సిద్దిపేట రూరల్‌లో 3.7 మి.మీ, చిన్నకోడూరులో 5.6మి. మీ, బెజ్జంకిలో 7.5 మి.మీ, కోహెడలో 6.3మి.మీ, హుస్నాబాద్‌లో 5.7మి.మీ, అక్కన్నపేటలో 10.4 మి. మీ, నంగునూరులో 3.8మి.మీ, సిద్దిపేట అర్బన్‌లో 4.4మి.మీ, తొగుటలో 6.5మి.మీ, మిరుదొడ్డిలో 5.0 మి.మీ, దౌల్తాబాద్‌లో 6.5మి. మీ, రాయపోల్‌లో 9.5 మి.మీ, వర్గల్లో10.1మి.మీ, ములుగులో 8.9మి.మీ, మర్కూక్‌లో 7.7 మి.మీ, జగదేవ్‌పూర్‌లో 3.8 మి.మీ, గజ్వేల్‌లో 7.9మి.మీ, కొండపాకలో 4.0మి.మీ, కొమురవెల్లిలో 1.5మి.మీ, చేర్యాలలో 2.7మి.మీ, మద్దూర్‌లో 5.8మి.మీ, నారాయణరావుపేటలో 1.6మి.మీ, దూల్మిట్టలో 4.1మి.మీ, అక్బర్పేట-భూంపల్లిలో 4.6మి.మీ, కుకునూర్‌పల్లిలో 5.7మి.మీటర్లు నమోదుకాగా అత్యధికంగా అక్కన్నపేట మండలంలో 10.4 మి.మీటర్లు అత్యల్పంగా కొమురవెల్లిలో 1.5మి.మీటర్లు నమోదైంది. జిల్లాలో సగటున 5.7శాతం వర్షపాతం కురిసింది.
మెదక్, జూలై 20 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా అంతటా శుక్రవారం ముసురు వాన కురు స్తుంది. శనివారం 10.9 మి.మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మాసాయిపేటలో అత్యధికంగా 29.2 మి. మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అల్లాదుర్గంలో అత్యల్పంగా 3.2 మి.మీటర్ల వర్షం పడింది. చేగుంటలో 18.4 మి.మీ, చిన్నశంకరంపేటలో 17.8 మి.మీ, కొల్చారంలో 14.5 మి, మీ, మెదక్‌లో 13.3 మి,మీ, నార్సింగిలో 12.6 మి, మీ, తూప్రాన్‌లో 11.9, టేక్మాల్‌లో 11.9 మి, మీ, వెల్దుర్తిలో 11.6 మి.మీ, హవేళీఘనపూర్‌లో 11.0మి. మీటర్ల వర్షం కురిసింది.