ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో 27.4 మి.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 23.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నిండిపోయాయి.
- నారింజ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
- వరదపై నీటిపారుదల శాఖ అధికారులు సూచన
- జహీరాబాద్ మున్సిపాలిటీలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. శుక్రవారం ఉదయం మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. కురుస్తున్న వర్షంతో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి అలుగు పోస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు ముందే అప్రమత్తం కావడంతో ఎటువంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకోలేదు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య రాకుండా చూస్తున్నారు. చెరువులు, కాల్వల గండ్లు పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. సహాయక చర్యలు ప్రజాప్రతినిధులు భాగస్వామయ్యారు.
-మెదక్ సంగారెడ్డి జిల్లా నెట్ వర్క్, జూలై 28

జహీరాబాద్, జూలై 28 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సూచించారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. అనంతరం నారింజ ప్రాజెక్టును పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. జహీరాబాద్ పట్టణంలోని సుభాశ్గంజ్లో పర్యటించి వ్యాపారులతో మాట్లాడారు. జహీరాబాద్ నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, శిథిల భవనాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నారింజ ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నందున దిగువున ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలన్నారు. ప్రధాన రోడ్డు వెంట ఉన్న మటన్, చికెన్ షాపులను పరిశీలించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్, అత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహినోద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

వంతెన నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలి
- ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ రూరల్, జూలై 28: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మండలంలోని తిమ్మానగర్ వద్ద కొంటూరు నుంచి ఖాజాపూర్ వెళ్లే దారిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు కల్వర్ట్టును ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆర్అండ్ఈ వెంకటేశంతో కలిసి పరిశీలించారు. కురుస్తున్న వర్షాలకు మట్టి కొట్టుకుపోయిన కల్వర్టు (మైనర్ వంతెన) నిర్మాణానికి రూ.కోటి మంజూరయ్యాయని, త్వర లో టెండర్లు పిలిపించి వంతెన నిర్మాణ పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలో కాలినడకన వాడవాడకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. వర్ష్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజ లు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఆత్మకమిటీ చైర్మన్ ఆంజాగౌడ్, ఆర్అండ్బీ ఏఈ రియాజ్, నాయకులు ఆంజనేయులు, నవీ న్, గ్రామస్తులు ఉన్నారు.




Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

