గజ్వేల్, డిసెంబర్ 23: కేసీఆర్ హయాంలో పండుగలకు ప్రాధాన్యం లభించిందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్రిస్టియన్ భవనంలో నిర్వహించిన క్రిస్మస్ సంబురాల్లో భాగంగా ఆయన మాట్లాడా రు. ప్రతి యేడు క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానుకలు అందజేసి ముందస్తుగానే శుభాకాంక్షలు తెలిపిందన్నారు.
కులమతాలకతీతంగా కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో అన్ని వర్గాలు పండుగలను సంతోషంగా జరుపుకునే వారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసి పండుగల సమయాల్లో కానుకలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆర్డీవో చంద్రకళ, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, తహసీల్దార్ శ్రవణ్, వైస్ చైర్మన్ సర్దార్ఖాన్, నాయకులు భాస్కర్, మోహన్, శివారెడ్డి పాల్గొన్నారు.