మనోహరాబాద్, ఏప్రిల్ 21: పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి తప్పక గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు శేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్‌లోని శుభం గార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చలో ఎల్కతుర్తి వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని కోరారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో మళ్లీ తెలంగాణ ఆగమైందన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు చెందారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నవనీతా రవి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ పొట్టోళ్ల లతావెంకట్గౌడ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు రతన్‌లాల్, యూత్ అధ్యక్షుడు రాహుల్‌రెడ్డి, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు నరేశ్, భిక్షపతి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, సాయిరాంగౌడ్, మహిపాల్‌రెడ్డి, సత్యనారాయణ, ఆనంద్, నరేందర్‌గౌడ్, నర్సింహులు, మహబూబ్‌రెడ్డి, పాల్గొన్నారు.