మెదక్ మున్సిపాలిటీ, మే 26: పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్‌మేళాల మధ్య మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు బోనాలు తీశారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం పట్టణంలోని ఆయా వీధుల్లో గల మున్నూరుకాపు మహిళలు బోనాలను ఎత్తుకుని రాందాస్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్, గోల్కోండ వీధుల మీదుగా బోనాల శోభాయాత్ర కొనసాగి ఆటోనగర్‌లోని నల్ల పోచమ్మ దేవాలయానికి చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్, పట్టణ అధ్యక్షుడు గట్టేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు, శేఖర్, సుమన్, సం ఘం నాయకులు అశోక్, సుమన్, నిఖిల్, భూషణం, కామాటి కృష్ణ, మల్లేశం, చంద్రశేఖర్, విజయ్, మహిపాల్, ప్రసాద్, బాల రామ్, వంశీ, రమేశ్ తదితరులు పాల్గ్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూల మల్లేశం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.