మహా ధర్నాను విజయవంతం చేయండి : ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి
సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహించే మహా ధర్నాకు జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
పాపన్నపేట, ఆగస్టు 7 :సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహించే మహా ధర్నాకు జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా నిర్వహించ తలపెట్టామని, ఈ కార్యక్రమానికి కనివిని ఎరుగని రీతిలో ఉపాధ్యాయులు హాజరు కావాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పి ఆర్ సి నివేదికను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలని కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలను సత్వరమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఓ పి ఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సిపిఎస్ ఉపాధ్యాయుల చిరకాల కోరిక అయినా ఓ పి ఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షం గౌడ్, మోహన్ రెడ్డి, పి ఆర్ టి యు టి ఎస్ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సామ్యా నాయక్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు సబ్బని శ్రీనివాస్ రాష్ట్ర ,జిల్లా, మండల బాధ్యులు సత్నారాయణరెడ్డి,వెంకటరామిరెడ్డి, మహేశ్,రామచంద్రాచారి, రాజు, సురేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

