మెదక్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు, క్రిస్మస్ పండుగ సందర్భం గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హాజరవు తారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు మెదక్ చర్చిలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.