గజ్వేల్, ఆగస్టు 22: ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు విలువ లేకుండా కొర్రీలు పెట్టి సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోగా, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఐవోసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సంపూర్ణ రుణమాఫీ చేయాలని ఆర్డీవో బన్సీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఒకటి, రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాళేశ్వరం కూలుతుందని ప్రచారం చేసిన ప్రభుత్వానికి, నేడు గోదావరి జలాలతో కళకళలాడుతున్న మేడిగడ్డ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రూ.41 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, రూ.17వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకోవడంతో రుణమాఫీ కాని రైతులు నేడు బ్యాంకు లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రుణమాఫీపై సరైన అవగాహన లేక సీఎం, మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
త్వరలో గజ్వేల్‌లో కేసీఆర్ నాయకత్వంలో 15వేల మంది రుణమాఫీ కాని రైతులతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు జుబేర్‌పాషా, ప్యాక్స్ చైర్మన్ వెంకటేశం గౌడ్, మండలా ధ్యక్షుడు మధు, నవాజ్‌మీరా, శ్రీనివాస్, కుమార్, మాజీ జడ్పీటీసీలు మ ల్లేశం, అర్జున్‌గౌడ్, బాలమల్లు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, పాండుగౌడ్, దుర్గయ్య, నరేందర్, కృష్ణగౌడ్, అహ్మద్, స్వా మి, ఉమార్ పాల్గొన్నారు.