గజ్వేల్, ఏప్రిల్ 25: ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గ్రామానికి వంద మంది చొప్పున 15వేల మందిని 280 ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వెళ్లేలేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
హరీశ్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో పాటు తొమ్మిది మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహించుకొని దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామం నుంచి బయలుదేరే బస్సు సభా ప్రాంగణానికి రెండు గంటల ముందే చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చేలా గ్రామాల్లోని ముఖ్య కార్యకర్తలు చూసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం అన్నింటా విఫలమైందని వారు విమర్శించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి కనబడేలా ఉద్యమకారులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేజాల వెంకటేశంగౌడ్, రాజమౌళి, మాదాసు శ్రీనివాస్, కృష్ణారెడ్డి, నవాజ్‌మీరా, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, దయాకర్‌రెడ్డి, రజిత, రమేశ్‌గౌడ్, హైదర్‌పటేల్, దేవేందర్, నాగిరెడ్డి, చందు, కనకయ్య, మన్నె వెంకటేశ్, అశోక్, మధుసూదన్‌రెడ్డి, శివకుమార్, మోహన్‌బాబు, కరీం, మురళి తదితరులు పాల్గొన్నారు.