రేవంత్‌కు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు
రేవంత్‌రెడ్డికి రాజకీయం తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం వద్ద కండ్ల ముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే, రేవంత్ రెడ్డి గుడ్లు అప్పగించి చూస్తున్నాడని మండిపడ్డారు.
- జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్న సీఎం
- కేసీఆర్ కాలువల్లో గోదావరి జలాలు పారిస్తే.. రక్తాన్ని చల్లాలంటున్న దుర్మార్గపు సీఎం రేవంత్
- ఇంత దుర్మార్గమైన సీఎంను ఎకడా చూడలేదు
- రైతుల ఆగ్రహంలో రేవంత్‌రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం..
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజం
చిన్నకోడూరు, జూలై 19: రేవంత్‌రెడ్డికి రాజకీయం తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం వద్ద కండ్ల ముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే, రేవంత్ రెడ్డి గుడ్లు అప్పగించి చూస్తున్నాడని మండిపడ్డారు. రైతుల కష్టాలు చూసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలని ఆయన డిమాండ్ చేశా రు. మా ప్రాణాలైనా తీసుకో… కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసి మాకు సాగునీరు ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నా సీఎం రేవంత్‌రెడ్డికి కనికరం కలగడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి పంపుల్ ఆన్ చేసి తక్షణమే నీళ్లు విడుదల చేసి సాగునీరివ్వాలనే డిమాండ్‌తో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్లోని అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డతో పనిలేదని, కన్నెపల్లి పంపులు ఆన్‌చేస్తే రిజర్వాయర్లు నిండుతాయని అన్నారు. మనం గోదావరి జలాలు వదిలిపెడితే, ఆంధ్రావాళ్లు ఒడిసి పట్టుకుంటున్నారని, రేవంత్‌రెడ్డికి ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును కోస్తే వచ్చే రక్తాన్ని పొలాల్లో చల్లితే పంటలు పండుతాయని రేవంత్‌రెడ్డి మాట్లాడడం తగదన్నారు. ఇలాంటి దుర్మార్గమైన సీఎంను మనం చరిత్రలో ఎప్పుడైనా చూశామా అని అన్నారు. కేసీఆర్ కాలువల్లో గోదావరి జలాలు పారిస్తే, రేవంత్ రెడ్డి రక్తం పారిస్తా అని మాట్లాడడం హేయమైన చర్య అని దేశపతి అన్నారు. మా రక్తాన్నైనా తీసుకో రేవంత్‌రెడ్డి, కానీ.. రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలు నాశనమైనా పర్వాలేదు, తెలంగాణ ఎడారిగా మారి నా పర్వాలేదు, కానీ.. తన పరువు పోతుందని రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ ఆన్‌చేయడం లేదని మండిపడ్డారు. పంపులు ఆన్ చేస్తే రైతుల కళ్లల్లో కేసీఆర్ కనబడతాడని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. కాళేశ్వరం కూలిందని మాట్లాడిన రేవంత్ రెడ్డికి, కన్నెపల్లి పంపులు ఆన్‌చేస్తే పుట్టగతులు ఉండవని భయం పట్టుకుందని విమర్శించారు. ఇలాంటి పాలకుడు మనకు అవసరమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి శనీశ్వరుడు అని మండిపడ్డారు. కాళేశ్వరం వద్ద నీళ్లు ఎత్తిపోయకుండా ఇసుకను ఎత్తిపోసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో నదులు ఆం ధ్రకు పారుతున్నాయని, నిధులు ఢిల్లీకి పోతున్నాయని, అందుకే గల్లా పట్టి నిలదీసేందుకు మా రైతులందరం సిద్ధంగా ఉన్నామని, రేవం త్‌రెడ్డి ఖబడ్దార్ అని హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

