మెదక్ మున్సిపాలిటీ, మే 30 : ప్రభుత్వ బడుల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. హవేళిఘనపూర్ మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిభిరాన్ని అంజిరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారన్నారు. విద్యార్థులను ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మెనిఫెస్టోలో సూచించిన విధంగా ఉపాధ్యాయుల సమస్యలైనా జీవో 317, పాత పెన్సన్ విధానం అమలు చేయడం, పీఆర్సీ పెండింగ్, డీఏలను, బీపీఎస్ నిధులను వెంటనే విడిదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాధాకిషన్, ఎంఈవో సుదర్శనమూర్తి, కోర్స్ డైరెక్టర్ గంగయ్య, తపస్ నాయకులు లక్ష్మన్, స్వరూప, మాదవరెడ్డి, రామరావు తదితరులు ఉన్నారు.