సిద్దిపేట కమాన్, ఆగస్టు 25 : సిద్దిపేటలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి మంచి పౌరులను అందించే విద్యాలయాలు సరస్వతి శిశుమందిరాలన్నారు.
పూర్వ విద్యార్థిగా పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. నేను ఒకటోతరగతి నుంచి ఆరోతరగతి వరకు సరస్వతి శిశుమందిరంలో చదువుకున్నానన్నారు. ఇకడ చదువుకున్న వారికి ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఎకువగా ఉంటుందన్నారు.
ఎలాంటి కష్టమైనా ఎదురొనే శక్తి వస్తున్నదన్నారు. సామాజిక బాధ్యత, దేశభక్తి పెంపొందించే ఉత్తమ పాఠశాలలు సర్వస్వతి స్కూళ్లు అని గుర్తుచేశారు. సమాజం కోసం స్వచ్ఛందంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యను అందిస్తారన్నారు. సరస్వతి శిశుమందిర్‌లో ఇంగ్లిష్ విద్యాభ్యాసం కూడా అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్ మల్లికార్జున్, పాఠశాల బృందం పాల్గొన్నారు.