సిద్దిపేట, సెప్టెంబర్ 4: కాంగ్రెస్ సర్కారు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నదని, ఈ ప్రాంతానికి మంజూరైన పలు పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకుపోయి అన్యాయం చేస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కా ర్యాలయంలో 190మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. సిద్దిపేటలో అమర్నాథ్ ఆన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
డెంగీ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మా ట్లాడుతూ..ఖమ్మం వరద బాధితులకు సహాయం చేద్దామని పోతే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడడం తగదన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట రూపురేఖలు మార్చుకున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేటకు మంజూరైన కాలేజీని కొడంగల్‌కు తరలించుకుపోయాడని విమర్శించారు. అవసరమైతే కొడంగల్‌కు నూతన కాలేజీని మంజూరు చేసుకోవాలని, సగంవరకు పనులు చేపట్టిన మన కాలేజీని గద్దలా తన్నుకుపోయాడన్నారు. కోమటి చెరువు వద్ద నిర్మిస్తున్న శిల్పారామం పనులను నిలిపివేశాడన్నారు. సిద్దిపేట అభివృద్ధికి ఊపిరి ఉన్నంత వరకు కృషి చేస్తానని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా తీర్చిదిద్దానన్నారు.
ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవాసమితి ముందుకు రావ డం అభినందనీయం అని హరీశ్‌రావు అన్నారు. వీరి ఆధ్వర్యంలో గురువారం ఉదయం లారీల్లో 500 నిత్యావసర గ్రాసరి కిట్లు, ఇతర సామన్లు ఖమ్మం తరలించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణ ఐఎంఏ తమ వంతు సహాయంగా రూ.లక్ష విరాళం అందజేసిందన్నా రు. సిద్దిపేటకు చెందిన చాలామంది వ్యాపారులు తమ వంతు సహాయంగా వస్తువులు, నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు.
సిద్దిపేటకు చెం దిన వ్యాపార వేత్త ఉప్పల కృష్ణమార్తి రూ.11వేలు, సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి రూ.25,116, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ రూ.11వేలు, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు తమ నెల వేతనం వరద బాధితులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. ఆపద సమయంలో సేవ, సాయం చేయడానికి రాజకీయా లు వద్దన్నారు. ఎవరికి వారు తోచిన విధంగా సహా యం అందించాలని మాజీమంత్రి హరీశ్‌రావు కోరారు.
ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడానికి సిద్దిపేట ఐఎంఏ వై ద్యులు ముందుకు వచ్చి రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యే హరీశ్‌రావుకు బుధవారం క్యాంప్ కార్యాలయం లో అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు భాస్కర్‌రావు, సతీష్, శ్రీనివాస్, రజనీకాంత్, సదానం దం తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యం లో దేశవ్యాప్తంగా సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 13 ఏండ్ల్లుగా అమర్నాథ్ యాత్రికులకు అన్నదానం చేస్తున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 10 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. సిద్దిపేట ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, అమర్నాథ్ అన్నదాన సేవాసమితి అధ్యక్షుడు కోర్తివాడ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నేతి కైలాసం, కోశాధికారి తిప్పరాజు మధుసూదన్, పీఆర్వో కుమ్మరికుంట రమేశ్, మీడియా ఇన్చార్జి గ్యాదరి పరమేశ్వర్, కౌన్సిలర్లు, సమితి సభ్యులు పాల్గొన్నారు.